చిరూ.. బాలయ్య ద‌ర‌రా ఫైట్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే..?

-

ఒకే రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే అటు అభిమానుల‌కు.. ఇటు ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అని చెప్పాలి. అయితే ఈ ఏడాది దసరా పండ‌గ‌కు ఇద్ద‌రు సీనియ‌ర్ హీరో పోటీ ప‌డ‌నున్నారు. అందులో బాల‌య్య ఒక‌రైతే.. చిరంజీవి మ‌రొక‌రు. చిరంజీవి – కొరటాల సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. సామజిక సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష నటించనున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయమని ముందుగానే చిరంజీవి చెప్పి ఉండటం వలన, కొరటాల అదే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్లాన్ చేసుకున్నారు. మ‌రోవైపు బాలకృష్ణ సినిమా కూడా దసరా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

వచ్చేనెల 15వ తేదీ నుంచి బాలకృష్ణ – బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దసరా బరిలో తమ సినిమా ఉండవలసిందేనని బోయపాటితో బాలకృష్ణ గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే బాలయ్య, చిరు ల మధ్య ఆసక్తికర బాక్సాఫీస్ పోరు జరుగనుంది. 2017లో సంక్రాంతి కి వీళ్ళిద్దరూ పోటీపడ్డారు. చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 జనవరి 11న విడుదల కాగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ఒక రోజు వ్యవధిలో 12న విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లను ద‌క్కించుకున్నాయి. మ‌రి ఈ సారి ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news