ఈ మ్యాచ్ గెలిస్తే టీం ఇండియా సరికొత్త చరిత్ర…!

-

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం మూడో మ్యాచ్ జరగనుంది. హామిల్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలిస్తే చరిత్ర సృష్టించినట్టే. తొలిసారి కివీస్ గడ్డపై టీం ఇండియా సీరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో గెలిచి కివీస్ నుంచి సీరీస్ లాక్కోవాలని భావిస్తుంది.

మధ్యాహ్నం 12;30కి ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టీం ఇండియాకు దాదాపుగా అన్ని కలిసి వచ్చే అంశాలే. ఓపెనర్ రోహిత్ శర్మ ఫాంలో లేకపోవడం మినహా అన్ని టీం ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. యువ ఆటగాళ్ళు శ్రేయాస్ అయ్యర్, ఓపెనర్ కెఎల్ రాహుల్ చెలరేగి ఆడుతున్నారు. కోహ్లి కూడా తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

మొదటి రెండు మ్యాచుల్లో అయ్యర్, రాహుల్ జట్టుని గెలిపించారు. వికెట్ పడకుండా కాపాడుకుంటూ ప్రత్యర్ధి మీద దూకుడుగా దాడి చేస్తున్నారు. మొదటి రెండు మ్యాచుల్లో రాహుల్ అర్ధ సెంచరీలు చేస్తే అయ్యర్ మొదటి మ్యాచ్ లో 58, రెండో మ్యాచ్ లో 44 పరుగులు చేసాడు. ఇక బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. బూమ్రా, శమీ మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేస్తున్నారు. ఒక్క రోహిత్ శర్మ ఫాం మాత్రమే టీం ఇండియా ని కలవరపెడుతుంది.

రోహిత్ కివీస్ గడ్డపై ఇప్పటి వరకు మంచి ప్రదర్శన చేయలేదు. దీనితో అతనిపై భారత శిబిరం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక కివీస్ కి పెసర్లు బోల్ట్, ఫెర్గ్యుసన్ దూరం కావడం ఇబ్బంది పెట్టె అంశం. మొదటి మ్యాచ్ లో 200కి పైగా పరుగులు చేసినా బౌలింగ్ విభాగం పటిష్టంగా లేకపోవడంతో మ్యాచ్ ని కాపాడుకోలేకపోయింది ఆ జట్టు. బ్యాటింగ్ లో బలంగానే ఉన్నా బౌలింగ్ విభాగం వేధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news