Mega157 : మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అప్డేట్

-

Mega157 : మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ పొందిన డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ నెక్స్ట్ సినిమాను తెరకెక్కించనున్నారు. MEGA157ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుండగా… చిరు బర్త్డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘బోలా శంకర్’తో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్… కొత్త సినిమాతో ట్రోలర్స్ నోళ్లను మూయించాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భోళా శంకర్.. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి క్యారెక్టర్ లో మెప్పించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలయ్యి .. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా.. డైరెక్టర్ మెహర్ రమేష్ ను నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news