బాలయ్య యూఎస్ బుకింగ్స్ ఫుల్! ప్రేక్షకులు నిల్ చిరు ఫ్యాన్స్ ఆరోపణ.!

-

నందమూరి బాలకృష్ణ  ప్ర  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు నుంచి ఊహించి నట్లు గానే పక్తు బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.ఇక బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం సినిమా పండగ లా ఉందని అంటున్నారు.ఇక రేపు థియేటర్స్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్దంగా ఉంది.

అయితే ఈ సినిమాలు సంక్రాంతికి విడుదల అన్న దగ్గర నుండి హీరోల ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా తమదే పైచేయి సాధించింది అని చెప్పుకోవడాని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇందులో తాజాగా బాలయ్య బాబు యూఎస్ బుకింగ్స్ మొత్తం ఫ్యాన్స్ రికార్డ్ కోసం చేసిన బుకింగ్స్ అని చిరు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి ఫ్యాక్షన్ మూవీ లు చూడటానికి అక్కడి ఫ్యాన్స్ ఆసక్తి చూపరు అని అంటున్నారు. అన్లైన్లో టికెట్స్ ఫుల్ అయినట్లు చూపిస్తుంటే థియేటర్స్ లో మాత్రం సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయట. అంటే కొద్ది మంది వీరసింహారెడ్డి చిత్ర టికెట్స్ మొత్తం ఆన్లైన్ కొనేశారని, దీని కోసం బాలకృష్ణ సామాజిక వర్గానికి చెందిన తానా సభ్యులు తమ సొంత డబ్బులు కోట్లు ఖర్చు చేసి వీరసింహారెడ్డి కి అధిక కలెక్షన్స్ గా చూపించారని మెగా ఫ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది నిజమో కాదో పెరుమాళ్లు కే తెలియాలి

Read more RELATED
Recommended to you

Latest news