యాంటీబయాటిక్స్‌ వాడకం వల్ల ఐబీడీ రిస్క్‌ ఎక్కువ..తేల్చిన సర్వే..

-

యాంటీబయాటిక్స్‌ వాడటం ఈరోజుల్లో అందరికీ బాగా అలావాటైపోయింది. డాక్టర్ల సలహా లేకుండానే వాడేవాళ్లు చాలామంది ఉన్నారు. యాంటీబయాటిక్ వినియోగం 40 ఏళ్లు పైబడినవారిలో ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ ఇల్‌నెస్ (క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్) రిస్క్‌ను పెంచుతుందని జర్నల్ గట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. యాంటిబయాటిక్ వినియోగం వల్ల ఒకటి రెండేళ్లలో రిస్క్ పెరుగుతూ ఉంటుందని, గట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని కూడా తేల్చింది. ఈ అధ్యయనంలో తేలిన షాకింగ్‌ నిజాలు ఇలా ఉన్నాయి..
పర్యావరణ కారకాలు కూడా ఈ ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)కి కారణమవుతాయని సర్వే తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని.. రానున్న దశాబ్దకాలంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.. నేషనల్ మెడికల్ డేటా నుంచి 2000 – 2018 మధ్య గల ఐబీడీ పేషెంట్ల వివరాలు సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. దాదాపు 61 లక్షల మంది డేటా నుంచి ఈ అధ్యయనం చేశారు. వీరిలో సగం మంది మహిళలు కూడా ఉన్నారు. కనీసం ఒక్కసారైనా యాంటీబయాటిక్స్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ కాలంలో 36,017 మందిలో అల్సరేటివ్ కొలైటిస్, 16,881 మందిలో క్రాన్స్ డిసీజ్ ఉన్నట్టు సర్వేలో తేలింది.
మొత్తంగా చూస్తే యాంటిబయాటిక్ వినియోగించని వారితో పోల్చితే వినియోగించిన వారిలో ఐబీడీ ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.. వయస్సుతో సంబంధం లేకుండా రిస్క్ అధికంగా ఉందని అధ్యయనంలో గుర్తించారు..10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో ఐబీడీ ఉండేందుకు 28 శాతం ఎక్కువ ముప్పు ఉందని, 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో 48 శాతం ఎక్కువ ముప్పు ఉందని అధ్యయనం ద్వారా తెలిసింది..60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు 47 శాతం ఉందని తేల్చింది.

ఏ వయసు వారికి రిస్క్‌ ఎక్కువ..?

అల్సరేటివ్ కొలైటిస్ కంటే క్రాన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని.. 10 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతం, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 62 శతం, 60 పైబడిన వారిలో ఈ రిస్క్ 51 శాతం ఉందని అధ్యయనం తేల్చింది. ఈ రిస్క్ క్యుములేటివ్‌గా ఉందని, అంటే యాంటీబయాటిక్ కోర్సు తీసుకున్నప్పుడల్లా ఆ రిస్క్ అదనంగా వయస్సును బట్టి 11 శాతం, 15 శాతం , 14 శాతం పెరిగిందని స్టడీ తేల్చింది. యాంటిబయాటిక్స్ ఐదు సార్లు, లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రిస్క్రిప్షన్ పొందిన వారిలో రిస్క్ తీవ్రంగా ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు.. 10 నుంచి 40 ఏళ్ల మధ్యలో 69 శాతం అధికంగా, 60 ఏళ్లు పైబడిన వారిలో 95 శాతం అధికంగా రిస్క్ ఉన్నట్టు గుర్తించింది.
అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనమని, కారణాన్ని నిర్ధారించలేమని పరిశోధకులు అంటున్నారు.. పేషెంట్లు ఏయే యాంటిబయాటిక్స్ తీసుకున్నారు? వాస్తవ వినియోగం ఎంత వంటి సమాచారం అందుబాటులో లేదని వివరించారు. ఏది ఏమానా యాంటిబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా తీసుకోవద్దు..ఎక్కువగా కాదు..అసలు వాటిని వాడకపోవడం ఉత్తమం.. సమస్యలు వచ్చినప్పుడు వాటిని నాచురల్గా ఎలా పరిష్కరించుకోవాలో చూడండి. కొంతమంది రోజుకు 4,5 పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుంటారు.. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి..యాంటిబయాటిక్స్ పరిమితం చేయడం వల్ల వాటి నిరోధకతను అరికట్టడమే కాకుండా, ఐబీడీ రిస్క్ తగ్గించగలదని పరిశోధకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news