రీమేక్​లపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

‘‘అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్‌ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ.. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి ఈ సినిమా గురించి.. రీమేక్​ సినిమాల గురించి మాట్లాడారు. భోళా శంకర్ తన మనసుకు నచ్చి చేసిన చిత్రమని చిరు అన్నారు. రీమేక్‌లు చేస్తుంటారేంటని కొందరు తరచూ అడుగుతుంటారని.. కానీ ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్‌ చేస్తే తప్పేంటన్నది తనకు అర్థం కాదని అన్నారు.

‘ఈ ‘భోళా శంకర్‌’ మాతృక ‘వేదాలం’ ఏ ఓటీటీ వేదికలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ చిత్రం చేసేందుకు ముందుకొచ్చా. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్‌ హిట్టవుతుందన్న భరోసా అందరిలో కనిపించింది.’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news