అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
గద్దర్ అంతిమయాత్ర రూట్ మ్యాప్ సంబంధించిన వివరాలు
1. ఎల్బీ స్టేడియం నుంచి 12 గంటలకు అంతిమయాత్ర
2. గన్ పార్క్ , అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని నివాసం వరకు అంతిమయాత్ర
3. అల్వాల్ లోని నివాసం వద్ద కొద్దిసేపు పెడతారు.
4. నివాసం వద్ద నుంచి సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు..