చిన్నల్లుడి సినిమా కోసం రంగంలోకి దిగిన చిరంజీవి.. ర‌ఫ్ఫాడిస్తున్నారుగా..!

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని.. పులి వాసు దర్శకత్వం ‘సూపర్ మచ్చి’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ భామ రచితా రామ్‌ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ను చిరంజీవి పరిశీలించారట. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి పూర్తి కథను వినేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు మొదలైందట.

అయితే స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా పట్టు కనిపించకపోవడంతో, ఆయన పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దింపినట్టుగా సమాచారం. అలాగే డైలాగ్స్ పై కూడా దృష్టి పెట్టమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సూచనలు .. సలహాలు ఇస్తూ వెళుతున్నారట. నిర్మాణ పరమైన విలువల దగ్గర రాజీ పడొద్దని కూడా ఆయన రిజ్వాన్ కి చెప్పారని అంటున్నారు. సినిమా పూర్తయిన తరువాత దీనిని దిల్ రాజు చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి వున్నారని చెబుతున్నారు. కల్యాణ్ దేవ్ హిట్ కోసం చిరంజీవి రంగంలోకి..
కాస్త గట్టిగానే ర‌ఫ్ఫాడిస్తున్నార‌ని టాక్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.