సోషల్ మీడియాలో తన అభిమానికి కీలక పదవి ఇచ్చిన జగన్…!

-

సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ ఆలయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఈ మూడు ప్రముఖ ఆలయాలకు పాలక మండలి సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మండలికి 16 మంది సభ్యుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు. విజయవాడ దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును నియమించే అవకాశం ఉంది. ఇక పాలక మండళ్ళలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను, భక్తులకు కల్పించే సౌకర్యాలు, వివాదాలు రాకుండా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకి వెళ్ళాలి. గడ్డం ఉమా అనే సోషల్ మీడియా కార్యకర్తకు జగన్ పాలక మండలిలో అవకాశం ఇచ్చారు.

సింహాచలం : లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (ఛైర్మన్‌)
2. దాడి దేవి
3. వారణాసి దినేశ్‌రాజ్‌
4. నల్లమిల్లి కృష్ణారెడ్డి
5. జి.మాధవి
6. గడ్డం ఉమ
7. రాగాల నరసింహారావు నాయుడు
8. దాడి రత్నాకర్‌
9. సూరిశెట్టి సూరిబాబు
10. రంగాలి పోతన్న
11. సంచిత గజపతిరాజు
12. దొనకొండ పద్మావతి
13. నెమ్మాడి చంద్రకళ
14. సిరిపురపు ఆశాకుమారి
15. విజయ్‌ కే. సోంధి
16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు)

విజయవాడ : దుర్గ గుడి పాలక మండలి సభ్యులు
1. పైలా సోమినాయుడు
2. కటకం శ్రీదేవి
3. డీఆర్‌కే ప్రసాద్‌
4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ
5. పులి చంద్రకళ
6. ఓవీ రమణ
7. గంటా ప్రసాదరావు
8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి
10. కార్తీక రాజ్యలక్ష్మి
11. నేటికొప్పుల సుజాత
12. నేలపట్ల అంబిక
13. కానుగుల వెంకట రమణ
14. నెర్సు సతీశ్‌
15. బండారు జ్యోతి
16. లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ (పధాన అర్చకుడు)

ద్వారకా తిరుమల : వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (ఛైర్మన్‌)
2. మాతూరు శ్రీవల్లీ
3. గ్రంథి శేషగిరిరావు
4. కర్పూరం గవరయ్య గుప్తా
5. గూడూరి ఉమాబాల
6. కనకతాల నాగ సత్యనారాయణ
7. కొండేటి పద్మజ
8. కొత్తా విజయలక్ష్మి
9. చిలువులూరి సత్యనారాయణరాజు
10. కుంజా శాంతి
11. నందిని బందంరావూరి
12. మనుకొండ నాగలక్ష్మి
13. జి. సత్యనారాయణ
14. మేడిబోయిన గంగరాజు
15. వీరమళ్ల వెంకటేశ్వరరావు
16. పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి)

Read more RELATED
Recommended to you

Latest news