రాం చరణ్ ని చూసి ఈర్ష్య పడుతున్న చిరంజీవి.. ఎందుకో తెలుసా ..?…!

-

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. జస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ లోనే రాం చరణ్ స్టామినా ఎలా ఉంటుందో చూపించారు పూరి జగన్నాధ్. అయితే ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. కాని ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర మాత్రం రికార్డ్స్ ని సృష్ఠించింది. చరణ్ కెరీర్ లో రెండవ సినిమా గా వచ్చిన మగధీర చాలా సినిమాల రికార్ద్స్ ని బ్రేక్ చేసింది. ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను రాం చరణ్ కి అసాధారణమైన క్రేజ్ వచ్చింది.

 

అప్పటి నుంచి రాం చరణ్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు. సినిమా సినిమాకి బడ్జెట్ పెరుగుతూనే ఉంది. భారీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాతో నిర్మాతగాను మారాడు. ఇంత చిన్న వయసులో నిర్మాతగా మారడం అందులో ఖైదీ నంబర్ 150, సైరా వంటి భారీ సినిమాలను నిర్మించడం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

అల్లు అరవింద్ లాంటి లెజండరీ ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా నిర్మాతగా ఏమాత్రం అనుభవం లేని రాం చరణ్ నిర్మాతగాను గ్రేట్ అనిపించుకుంటున్నాడు. అదీగాకాక సైరాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలన్న సాహసం మామూలుది కాదు అని మాట్లాడుకుంటున్నారు. దాంతో చిరంజీవి కొడుకు రాం చరణ్ ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. అంతేకాదు మగధీర లాంటి సినిమా కెరీర్ ప్రారంభంలోనే చేసి రికార్డ్స్ తిరగరాయడం, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండం ..మరో వైపు ఆచార్య సినిమా కి సంబంధిన వ్యవహారాలని చూసుకోవడం లాంటి విషయాలు ఇప్పుడు చిరంజీవి ని షాక్ కి గురి చేస్తున్నాయట.

 

తన వయసులో నేను ఇన్ని వ్యవహారాలు చేయలేదని ఇలాంటి భారీ సక్సస్ లు అందుకోలేదని మగధీర, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు, రాజమౌళి లాంటి దర్శకులు నాకు దొరకలేదని …ఈ విషయాలన్నిటిలో చరణ్ ని చూస్తుంటే నాకు అసూయ..ఈర్ష్య కలుగుతుంది అని పబ్లిక్ గానే చిరంజీవి చెప్పడం విశేషం. మొత్తానికి కొడుకు పట్ల చిరంజీవి పొందుతున్న ఆనందం అంతా ఇంతాకాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version