సొంత మీడియా చేయలేని పని వేరే మీడియా చేసిందా..?

-

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తోన్న జగన్ సర్కార్…దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారిత టెస్టులు చేస్తోంది. ఈ క్రమంలో బయటపడుతున్న కేసులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక, కరోనాతో మనం కలిసి జీవించాల్సిందేనని చెప్పిన జగన్ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా…టీడీపీ నేతలు నానా యాగీ చేశారు. చంద్రబాబు ఏకంగా జగన్ కు ప్రభుత్వం నడపడం చేతకాదన్నంత రేంజ్ లే విమర్శలు గుప్పించారు.

అయితే, మోడీ తరహాలోనే జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్,  ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ వంటి ప్రముఖులు మద్దతు పలికారు. జగన్ చెప్పింది అక్షర సత్యమే నని…లాక్ డౌన్ వల్ల కరోనాను పూర్తిగా నిర్మూలించలేమని చెప్పారు. దీంతో, టీడీపీ బ్యాచ్, ఎల్లో మీడియా, చంద్రబాబు నోళ్లు మూతబడ్డాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ విమర్శించడం…ఆ తర్వాత నాలుక కరుచుకోవడం కొత్తేం కాదు. కరోనా వస్తే ఎవరైనా పారాసిట్మాల్ వేసుకోవాల్సిందే…అని కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రారంభంలో జగన్ చెప్పారు. జగన్ వ్యాఖ్యలను టీడీపీ కామెడీ చేసింది.

అయితే, ఆ తర్వాత ప్రపంచం మొత్తం పారా సిటమాల్ తో పాటు…హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను కరోనా చికిత్సలో వాడడంతో టీడీపీ అండ్ కో కామ్ అయిపోయింది. ఇపుడు కూడా కరోనాతో సహజీవనం తప్పదన్న జగన్ కామెంట్స్ తో నిపుణులు, తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏకీభవించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూడతబడ్డాయి. కరోనాను ఇప్పటికిప్పుడు నిర్మూలించడం సాధ్యం కాదని, కొన్ని జాగ్రత్తలతో దానితో కలిసి జీవించాల్సిందేనని నిపుణులు చెప్పడంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా సైలెంటయింది. అయితే, జగన్ చెప్పిన వ్యాఖ్యలను నిపుణులు బలపరిచిన అంశాన్ని..తన సొంత పత్రిక సాక్షిలో కూడా జగన్ హైలైట్ చేయలేదు. ఏదో చిన్న వార్తలా రాసి వదిలేశారు.

అదే వైరి పత్రిక అయిన ఓ ప్రముఖ పత్రిక…నారాయణ మూర్తి, రఘురాం రాజన్ చెప్పిన విషయాలను ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్స్ గా వేశాయి. వారి వారి వెర్షన్ లనే హైలైట్ చేస్తూ…జగన్ కూడా ఇదే చెప్పారని ఓ కథనం రాసి ఉంటే…బాగుండేది. జగన్ వ్యాఖ్యలు చేదు నిజాలు…కాబట్టి….ఇటువంటి నిపుణుల వ్యాఖ్యల తీపి పూత వేయకపోతే జనాలకు రుచించదు. ఇకపైనైనా…ఆ విషయంలో జగన్ మరింత ఫోకస్ పెడితే….ఎల్లో మీడియాతో పాటు విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version