నిర్మాతల కోసం కొత్త ట్రెండ్‌ సెట్ చేస్తున్న చిరంజీవి

చిరంజీవి కెరీర్‌లో హై బడ్జెట్‌ మూవీ సైరా. దీని తర్వాత ఆ రేంజ్‌లో ఖర్చు పెట్టే మూవీ చిరంజీవి నుంచి ఇక రాకకపోవచ్చు. సైరా రిజల్ట్‌తో చిరంజీవి బడ్జెట్‌ తగ్గించుకునే పనిలో పడిపోయాడు. ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య కంటే బడ్జెట్‌ తగ్గించేస్తున్నాడు. అందులో భాగంగానే.. తక్కువ రెమ్యునరేషన్‌కు వచ్చే డైరెక్టర్స్‌.. మ్యూజిక్‌ డైరెకర్స్‌ను ఎంచుకుంటున్నాడట…

సైరాను 100 కోట్లతో తీద్దామనుకుంటే.. 200 కోట్లు దాటిపోయింది. పెట్టుబడితో పోల్చుకుంటే.. రాబట్టింది తక్కువే. ఈ హై బడ్జెట్‌ మూవీ మిగిల్చిన నష్టాల నుంచి ఆచార్యతో బైటపడాలనుకున్నాడు చిరంజీవి. అయితే కొరటాల రెమ్యునరేషన్‌ భారీగా వున్నా.. ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌ మూవీ కోసం రాజీ పడ్డాడు. కొరటాలకు ఇచ్చే రెమ్యునరేషన్‌ను భర్తీ చేయడానికి 90 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడిని కోరాడు. కరోనా ఎఫెక్ట్‌తో ఆచార్య బడ్జెట్‌ కూడా చేయిదాటిపోయింది. దీంతో.. తక్కువ బడ్జెట్‌తో సినిమా తీయడం ఎలా అని ఆలోచించిన మెగాస్టార్‌.. వినాయక్‌.. మెహర్‌ రమేశ్‌ వంటి దర్శకులను ఎంచుకున్నాడు.

ఆచార్య తర్వాత చిరంజీవి తమిళ హిట్‌ వేదళం రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఫామ్‌లోని లేని దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వవడమే ఎక్కువ. ఎంత ఇచ్చినా… తీసుకుంటాడు. త్రివిక్రమ్‌.. కొరటాల మాదిరి 15..20 కోట్లు ఇవ్వాల్సిన పనిలేదు. ఇలా ఓ 15 కోట్లు మిగిలినట్టే. చిరంజీవి ఏంటి? మెహర్‌ రమేశ్‌కు ఛాన్స్ ఇవ్వడమేంటని చాలామంది షాక్‌ అయ్యారు. కెరీర్‌లో ఒక్క హిట్ లేని ఈ దర్శకుడు సక్సెస్‌ కోసం కష్టపడతాడన్న కాన్ఫిడెన్స్‌తోపాటు.. బడ్జెట్‌ కంట్రోల్‌ అవుతుంది అనేది ఇక్కడ లెక్కగా తెలుస్తుంది.

చిరంజీవి నటించే సినిమాల వరుసలో లూసిఫర్‌ రీమేక్‌ కూడా వుంది. ఫ్లాపుల్లో వున్న వినాయక్‌ అయితే.. అనుకూలమైన బడ్జెట్‌లో వస్తాడు. కథ కోసం ఖర్చు పెట్టే అమౌంట్‌ రీమేక్‌ రైట్స్‌ కోసం ఇచ్చేశారు. ఠాగూర్‌.. ఖైదీ నంబర్‌ 150 వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన వినాయక్‌తో హ్యాట్రిక్‌ ప్లాన్‌ చేశాడు మెగాస్టార్‌. జై లవకుశ తీసిన బాబీని కూడా చిరంజీవి లైన్లో పెట్టాడు. మెహర్ రమేశ్‌.. వినాయక్‌.. బాబీ వంటి దర్శకులతో వర్క్‌ చేయడం వెనకాల మెగా ప్లానే వుంది. బడ్జెట్‌ తగ్గించి భారీగా లాభపడాలన్న కాన్సెప్ట్‌ వుందట. రెమ్యునరేషన్‌ విషయంలో మెగాస్టార్‌ రాజీ పడే ఛాన్స్‌ లేదు. అందుకే ప్రొడక్షన్‌ కాస్ట్‌ తగ్గించుకుని.. నిర్మాతకు భారీ లాభాలు తీసుకొచ్చే మెగా ప్లాన్‌ వేశాడు చిరంజీవి.