బిగ్ బ్రేకింగ్ : చిరంజీవికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్న లేదు పెద్ద లేదు, పేద లేదు ధనిక లేదు, అందిరికీ సోకుతోంది. తాజాగా సినీ హీరో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని సమాచారం. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు నుండి ఆచార్య షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు.

దీంతో ఆయనకు రిజల్ట్ పాజిటివ్ అని వచ్చిందని చెబుతున్నారు. పాజిటివ్ రిజల్ట్ వచ్చినా ఆయనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవట. పాజిటివ్ రావడంతో వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అలానే గత 4-5 రోజులుగా తనను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నానని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాననని అన్నారు. అయితే ఆయన రెండ్రోజుల క్రితమే నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ ని కూడా కలిసి వచ్చారు. దీంతో వారందరిలోనూ టెన్షన్ నెలకొంది.