90ల్లో ఆ ఏడాది సినిమాలకు దూరంగా ఉండిపోయిన చిరంజీవి..కారణమిదే..!!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్స్ డెఫినెట్ గా సక్సెస్ అవుతాయని మేకర్స్, మెగాఫ్యాన్స్ అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల షూటింగ్స్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు.

 

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఉన్న తన పేరును ‘చిరంజీవి’గా మార్చుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు మెగాస్టార్. ‘పునాది రాళ్లు’ పిక్చర్ తో నటుడిగా ఇంట్రడ్యూస్ అయిన చిరు..ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

డ్యాన్స్, ఫైట్స్, నటన ఇలా అన్ని అంశాల్లో సరి కొత్త పంథాలో పయనించిన మెగాస్టార్..తన కెరీర్ తొలినాళ్లలో అనగా 1978 నుంచి 1983 మధ్య కాలంతో ఐదేళ్లలోనే సుమారు 60కి పైగా చిత్రాలు చేశారు. అలా ఆయన నటించిన చిత్రాలు..ఏడాదికి సుమారుగా నాలుగు లేదా మూడు కనీసంగా రెండు చిత్రాలు అయినా విడుదలయ్యేవి. కానీ, ఆ ఏడాది మాత్రం ఒక్క పిక్చర్ కూడా రిలీజ్ కాలేదు. ఆ ఏడాది 1996.

1994-1995 మధ్య కాలంలో చిరంజీవి నటించిన ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. కానీ, వరుస పెట్టి ఆ పిక్చర్స్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దాంతో చిరు..ఆలోచనలో పడిపోయారు. వరుసగా ఫ్లాప్స్ ఎందుకు వస్తున్నాయి? అని ఆలోచించి..స్క్రిప్ట్స్ పైన ఫోకస్ పెట్టారు. ఆచి తూచి సినిమా స్టోరిలను ఎంచుకోవాలనుకున్నారు.

అలా ఏడాది పాటు అనగా 1996 ఏడాది మొత్తం సినిమా స్టోరిలను ఎంచుకున్నాడు. సరైన స్క్రిప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడు ‘హిట్లర్’ స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. 1997 మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘హిట్లర్’ పిక్చర్ విడుదలై ఘన విజయం సాధించింది. అలా ఫ్లాప్స్ నుంచి మళ్లీ సక్సెస్ వైపు అడుగులు వేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news