రెండో రోజు కొనసాగుతున్న మంత్రి నారాలోకేష్ ప్రజాదర్బార్

-

ఏపీ మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” రెండో రోజూ కూడా కొనసాగుతోంది. ఆదివారం రోజునా మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు మంగళ గిరి ప్రజలు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని రెగ్యులర్ చేయాలని లోకేషును కోరారు ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్.

Minister Naralokesh Prajadarbar continues for the second day

గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని పేర్కొన్నారు జగదీష్ అనే విద్యార్థి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని కోరింది సిబ్బంది. ఈ తరుణంలోనే… వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారించాలని అధికారులకు లోకేష్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news