“ఈ సినిమా ఇంత చక్కగా రూపు దిద్దుకోవడానికి కారణం ఐన అనిల్ రావిపూడి కి మొట్టమొదటి కాంగ్రాట్స్ చెప్పాలి .. ఈ చిత్రా నిర్మాత అనిల్ సుంకర గారితో పాటు అందరికీ నా కృతజ్ఞతలు .. మొన్న ప్యాపర్ లో ఫోటో చూసా మహేశ్ ది .. చాలా సేపు మిలటరీ డ్రస్ లో ఉన్న మహేశ్ ని చూస్తూ ఉండిపోయాను . ఏదైనా అనిపించినప్పుడు వెంటనే మహేశ్ తో షేర్ చేసుకుంటాను .. మెసేజ్ పెట్టాను వెంటనే రెస్పాండ్ అయ్యాడు తాను . తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేసేశారు, గెస్ట్ గా రండి అంటే షాక్ అయ్యాను .. ఇంత త్వర్వగా అయిపోయిందా అని అనుకున్నా .. ప్రతీ హీరో ప్రతీ డైరెక్టర్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి.
ఆరోగ్యకరమైన వాతావరణం లో సినిమా లు తీయాలని కోరుకుంటా . నా సినిమా ల విషయం లో ఆఖర్లో డబ్బులు తీసుకుంటూ ఉంటాను . మహేశ్ కూడా అలా చేస్తున్నాడు అని తెలిసింది , ప్రొడ్యూసర్ లకి హీరోలే నిలబడాలి . తక్కువ టైమ్ లో సినిమా ఫినీష్ చెయ్యడం ఇవన్నీ హెల్తీ వాతావరణం . 99 రోజుల్లో సినిమా పూర్తి చేస్తా అన్నారు కొరటాల శివ కూడా .. పబ్లిక్ లో కమిట్ అవుతున్నారు కొరటాల శివ కూడా. ఇలాంటి రోజు రావాలి, అందరూ నెమ్మదిగా తీస్తున్నారు సినిమాలు. బడ్జెట్ ని అందరూ కలిసి సేవ్ చెయ్యాలి. అందరం అలాగే చేస్తాము అని మాట ఇస్తున్నాను. ఈ సినిమా తో ఆ పంథా మొదలైంది. కృష్ణ గారు బాగా గుర్తుకు వచ్చారు.
సౌత్ ఇండియా లోనే మోస్ట్ సీనియర్ యాక్టర్ ఆయన. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదు అని నాకు అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆయనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఆయనకి వస్తే మనకి గౌరవం అవుతుంది. ఆయనకి ఆ అవార్డ్ రావడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి .. కృష్ణ గారి కొడుకు మహేశ్ దగ్గర నుంచి మహేశ్ బాబు తండ్రి కృష్ణ అనే స్థాయికి తీసుకొచ్చారు .. సినిమా ల మీద ఉన్న ఫ్యాషన్ మహేశ్ ని ఇలా మార్చింది .. “