చరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరు

-

రంగస్థలం తర్వాత రాం చరణ్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఊర మాస్ సినిమాల దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న బోయపాటి శ్రీను చరణ్ తో మొదటి సారి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమాకు హైలెట్ గా నిలిచే ఓ భారీ యాక్షన్ సీజ్ అజర్ బైజాన్ లో షూట్ చేస్తున్నారు. నెలరోజుల పాటు లాంగ్ షెడ్యూల్ కావడంతో చరణ్ ఇంకా చిత్రయూనిట్ ఇప్పటికే అక్కడ షెడ్యూల్ ప్రారంభించారు. అయితే చరణ్ కోసం చిరు సర్ ప్రైజ్ విజిట్ చేశాడట. అజర్ బైజాన్ లో సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో స్వయంగా వీక్షించాడట మెగాస్టార్ చిరంజీవి.

ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చిరంజీవి అజర్ బైజాన్ వెళ్లాడట. చిరుని సెట్ లో చూసి చరణ్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి మళ్లీ తిరుగు ప్రయాణం చేస్తారట. చిరంజీవి సైరా షూటింగ్ కూడా జార్జియాలో చేయాల్సి ఉంది. ఇప్పటికే సూరి తన టీంతో అక్కడికి వెళ్లారు. అంతా రెడీ అయ్యాక చిరంజీవి కూడా అక్కడకు వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version