ఇంద్ర రీ రిలీజ్ పై మెగాస్టార్ స్పెషల్ వీడియో

-

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ఇంద్ర సినిమా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు తన అభిమానుల కోసం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంద్రసేనా రెడ్డి.. అని అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోందని.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని అన్నారు. ‘ఇంద్ర’ అంత పెద్ద సక్సెస్‌ కావడానికి ప్రధాన కారణం దాని కథతో పాటు ఆ సినిమా కోసం మనసు పెట్టి పనిచేసిన వారు అని తెలిపారు.

తన సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్‌ చిత్రం ‘ఇంద్ర’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌ బి.గోపాల్‌ దీన్ని గొప్పగా తెరకెక్కించారని కొనియాడారు. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రీరిలీజ్‌ కావడం తనకెంతో సంతోషంగా ఉందని.. ఈతరం వాళ్లకు దీన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news