స్టేజ్ మీద కాజల్ ను ముద్దాడిన చోటా కె నాయుడు – వీడియో

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ సినిమాటోగ్రాఫర్స్ లలో చోటా కె నాయుడు ఒకరు. సీనియర్ అన్న రెస్పెక్ట్ ఆయనకు ఉంది. అలాంటి ఆయన ఈమధ్య చిలిపి వేశాలతో అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ చోటా కె నాయుడు ఏం చేశారంటా అంటే మొన్నామధ్య ఏదో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోల మీద నోరు పారేసుకున్న చోటా కె నాయుడు ఇప్పుడు ఓ హీరోయిన్ ను ముద్దుపెట్టి వార్తల్లో నిలిచాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న కవచం సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో స్టేజ్ మీద కాజల్ మాట్లాడుతుంటే అమాంతం ఆమెను వాటేసుకుని ముద్దాడేశాడు చోటా. ఆయన చేసింది అభిమానం కొద్ది అయినా చూసినవాళ్లంతా ఏదో అనుకున్నారు. కాజల్ తో తనకున్న చనువు కొద్ది తాను అలా చేశాడని కవర్ చేసినా.. కాజల్ కూడా చోటా నాయుడు చేసిన పనికి అవాక్కయ్యిందని తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ అయ్యింది. దీనిపై చోటా కె నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version