‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో ఛోటా కె. నాయుడు కెమెరా సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఛోటా కె. నాయుడు పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు…
ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. తను చాలా మంది దర్శకులతో పని చేశానని నేను కాస్త యారగంట్‌గా ఉంటానని అందుకే దర్శకులు నాతో పని చెయ్యడానికి భయపడతారని అంటున్నారు. అలాగే నాకు కొన్ని కండీషన్స్ ఉంటాయని నాకు నచ్చకపోతే నేను ఎవరు చెప్పినా విననని చాలా మంది భయపడతారు. అదే విధంగా నన్ను భరించడం కూడా చాలా కష్టం అంటున్నారు. ఏ డైరెక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినప్పుడు కసిగా వస్తారు కాబట్టి ఫస్ట్ మూవీ చింపేస్టారు. సూపర్ డూపర్ హిట్ చేస్తారు. ఆతర్వాత మళ్ళీ రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి.
90 పర్సెంట్ డైరెక్టర్లు అలాగే ఉంటారు. ఎవరైతే వరుసగా మూడు చిత్రాలు హ్యాట్రిక్ కొడతారో నా దృస్టిలో వాళ్ళే అసలైన డైరెక్టర్లు. మిగతావాళ్ళంతా వేస్ట్కింద వస్తారు అని అన్నారు. నేను ఎక్కువగా పక్కా కమర్షియల్ చిత్రాలను చేశాను. అలాగే నాకు ఎక్కువగా యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. హారర్ మూవీ చెయ్యడం ఇదే మొదటి సారి. ఈ మూవీ మొత్తం ఎక్కువగా నైట్స్ షూటింగ్ జరిగింది. 24 క్రాఫ్ట్‌లలో డైరెక్షన్ అనేది చాలా కష్టమైన జాబ్ అని నా ఉద్దేశ్యం. యాక్షన్ ఫిల్మ్స్ తర్వాత లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. తర్వాత కొరియోగ్రఫీ అన్నా చాలా ఇష్టం. నాకు ఇగో ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు అందరితోనూ కలిసిపోతాను