చేరిక‌ల వెనుక జ‌గ‌న్ వ్యూహం ఇదే..

-

రాష్ట్రంలో బీజేపీ బల‌ప‌డ‌కుండా నిరోధిండం,  టీడీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా జగన్ యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. చేరికలకు ద్వారాలు తెరవడం వెనక వైఎస్ జ‌గ‌న్ అసలు వ్యూహం ఇదే అంటున్నారు వైసీసీ నేత‌లు. ఇతర పార్టీల నేతలను చేర్చుకునే అవసరంలేదని తొలుత వైసీపీ అధినేత జగన్ భావించారు. తమ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలంగా ఉంద‌ని భావించారు. నియోజకవర్గానికి ఇద్దరు బలమైన నేతలు ఇన్చార్జిగా ఉండటంతో ఆయ‌న చేరిక‌ల‌పై పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు.

అయితే వైసీపీలో ఎంట్రీ లేకపోవడంతో జనసేన, టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీ కూడా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పొంది పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో ఆ పార్టీ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక జనసేన కూడా గత ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ కావడంతో ఆ పార్టీ నేతలు ఇక ఇక్కడ ఉండి లాభం లేదనకుని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే స్థానికంగా బలం పుంజుకోవ‌చ్చ‌ని భావించి వారంతా బీజేపీని ఎంచుకుంటున్నారు.

దీంతో ఏపీలో బీజేపీ బలపడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే బలమైన నేతలు కొందరు బీజేపీవైపు వెళ్లిపోయారు. చూస్తూ ఊరుకుంటే బీజేపీ బలపడటమే కాకుండా ఎన్నికల సమయానికి టీడీపీ కూడా పుం జుకునే అవకాశముంది. అయితే ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్ వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు.  ఈనే పథ్యంలోనే జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. తోట త్రిమూర్తులు తొలుత వైసీపీలో చేరాలనుకుని అక్కడ వీలు కాదని తెలియడంతో బీజేపీ వైపు చూశారు. ఈ సంగతి తెలిసిన వైసీపీ అధినాయకత్వం తోట త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పిందంటారు. బలమైన నేత కావడంతో తోట ఫ్యూచర్ లో పనికొస్తారని జగన్ భావించారు.

ప్రతిపక్షాలను మరింతగా బలహీన పర్చాలన్న వ్యూహంతోనే జ‌గ‌న్ చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  తెలుగుదేశం పార్టీ ఎన్నికల నాటికి మళ్లీ కొంత పుంజుకుంటుందన్నది జగన్ భావిస్తున్నారు. తన పార్టీలో ఉంటే ఆపార్టీలోకి వెళ్లేందుకు నేతలు ఇష్టపడర‌ని, అంతేకాకుండా ని యోజకవర్గాల సంఖ్యకూడా పెరిగే అవకాశమున్నందున చేరికలతో నష్టం లేదని జగన్ అ భిప్రాయపడుతున్న‌ట్లు స‌మాచారం.  అందుకోస‌మే నేతల వల్ల పెద్దగా ఉపయోగం లేకున్నా వారిని కూ డా చేర్చుకునేందుకు జగన్ రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news