సక్సస్ ఫుల్ డైరెక్టర్ బర్త్ డే విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు…!

-

టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నారు కొరటాల శివ. రైటర్ గా మంచి ఫాం లో ఉన్న కొరటాల రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి సినిమాని తెరకెక్కించి దర్శకుడిగా మారారు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చింది. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు తీసి మళ్ళీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను తీశాడు.

 

ఇలా స్టార్స్ తో తీసిన ప్రతీ సినిమా భారీ వసూళ్ళని సాధించి ఇకార్డ్స్ ని క్రియోట్ చేశాయి. కొరటాల శివ సాధించిన ఈ సక్సస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ చూసిన మెగాస్టార్ ఆచార్య సినిమా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాని తెరకెక్కిస్తున్న కొరటాల శివ ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటుండగా పలువు సినీ ప్రముఖు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ సందర్భాంగా కొరటాల కి ఒక అభిమాని చేసిన పోస్ట్ వైరల్ గాను మారింది.

Read more RELATED
Recommended to you

Latest news