2019 ఎన్నికల్లో తన ముద్ర చూపించేందుకు ప్రజల్లోకి వచ్చారు సిని నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన అంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రక్షాళణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రజల్లో మమేకమై వారి సమస్యల గురించి తన గొంతుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల గుర్తు రావడంతో మరింత ఊపందుకున్నారు.

గాజు గ్లాస్ గుర్తుతో పవన్ జనసేన రంగంలోకి దిగుతుంది. ఇక సిని పరిశ్రమ నుండి కూడా జనసేనకు మంచి సపోర్ట్ వస్తుంది. మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు హీరోలుగా ఉన్న కొంతమంది పవన్ అభిమానులు జనసేనకు సపోర్ట్ గా ఉన్నారు. అందులో భాగంగా మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి మెగా బ్రదర్ నాగ బాబు జనసేనకు 1.25 కోట్లను విరాళంగా ప్రకటించారు.
మెగాస్టార్ కూడా త్వరలో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయట. చేరేముందు పెద్ద మొత్తంలో డొనేట్ చేస్తారని అంటున్నారు. అల్లు అరవింద్, మిగతా మెగా హీరోలు జనసేనకు భారీ విరాళాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. పవన్ వీరాభిమాని అయిన నితిన్ కూడా జనసేనకు విరాళం ప్రకటించాలని ఉత్సాహంగా ఉన్నాడట. సంక్రాంతికి ముందు నితిన్ జనసేనకు సపోర్ట్ గా డొనేట్ చేస్తాడని తెలుస్తుంది. దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. ఇక అదే దారిలో మరో హీరో నిఖిల్ కూడా పవన్ జనసేనకు అండగా విరాళం ప్రకటిస్తాడని తెలుస్తుంది. షకలక శంకర్ కూడా జనసేనకు ఎంతోకొంత విరాళంగా ఇవ్వబోతున్నాడట.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పరిశ్రమ నుండి సరైన సపోర్ట్ లభించలేదని తెలిసిందే. ఒకరిద్దరు తప్ప పెద్దగా కదిలింది లేదు. కాని జనసేన మాత్రం పరిశ్రమలో పెను మార్పులు వచ్చేలా చేస్తుంది. ఇన్నాళ్లు సినిమా పరిశ్రమలో టిడిపి హయాం నడవగా జనసేన వచ్చి కొత్త పరిణామాలు తీసుకొచ్చింది. మరి ఇవి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.