త్వరలో కొత్త 20 రూపాయల నోటు రాబోతున్నది. అవును.. ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన 2000, 200 రూపాయల నోటుతో సహా మిగితా 500, 100, 50, 10 రూపాయల కొత్త నోట్లను తీసుకొచ్చింది ఆర్బీఐ.
ఇక.. మిగిలింది 20 రూపాయల నోటు మాత్రమే. అందుకే.. కొత్త 20 రూపాయల నోటును కూడా మార్కెట్ లోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ తెలిపింది. కొత్త 20 రూపాయల నోటు వచ్చినా.. పాత 20 రూపాయల నోటు కూడా చెలామణిలో ఉంటుంది. కొత్తగా వచ్చిన నోట్లన్నీ మహాత్మా గాంధీ న్యూ సిరీస్ తో వచ్చినవే. పాత నోట్లకు, కొత్త నోట్లకు ఏమాత్రం పోలిక ఉండదు. సైజ్ లో కూడా తేడా ఉంటుంది.
మార్చి 31, 2016 వరకు 492 కోట్ల 20 రూపాయల నోట్లు ఉండేవట. మార్చి 2018 వరకు 1000 కోట్లు అయ్యాయట. మార్చి 2018 నాటికి మొత్తం కరెన్సీలో 20 రూపాయల నోట్లు 9.8 శాతం ఉన్నాయట. కొత్తగా వచ్చే 20 రూపాయల నోటుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందట.