ఒక పాత్ర విషయంలో సమంతా, నాగ చైతన్య మధ్య విభేదాలు…?

-

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతా సినిమాల విషయంలో కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఇద్దరూ. చైతు సంగతి పక్కన పెడితే, సమంతా అయితే వరుసగా సినిమాలు చేస్తుంది. పెళ్లి తర్వాత మంచి మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. కుటుంబం నుంచి కూడా మద్దతు ఉండటంతో ఈ భామ ఆగడం లేదు.

భిన్నమైన కథలను చేస్తూ దూసుకుపోతుంది సమంతా. పెళ్లి తర్వాత ఆమె చేసిన అన్ని సినిమాలు కూడా దాదాపు హిట్ అయ్యాయి. అయితే తాజాగా ముంబై రెడ్ లైట్ ఏరియా కు సంబంధించి ఒక పాత్రలో బాలివుడ్ లో చేయడానికి సమంతా ఒప్పుకుందని సమాచార౦. కరణ్ జోహార్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాలో ఆమెకు ఒక కీలక పాత్రను దర్శకుడు రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రను కూడా సమంతాకు వివరించారట.

ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ భామ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కుటుంబంతో చర్చించకుండానే ఓకే చేసినట్టు సమాచార౦. దీనిపై నాగ చైతన్య అసహనం వ్యక్తం చేసాడట. అసలు ఎవరిని అడిగి ఆ పాత్రకు ఓకే చేసావని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచార౦. అలాంటివి ఓకే చేసే ముందు ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్టు ఓకే చేయవద్దని చెప్పేశాడట. పెళ్లి అయిందని, కాబట్టి పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడట.

Read more RELATED
Recommended to you

Latest news