మణిరత్నంతో మోహన్ బాబు..!

-

సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం తన తర్వాత సినిమా క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం కలక్షన్ కింగ్ మోహన్ బాబుని సంప్రదించారట మణిరత్నం. స్క్రిప్ట్ మొత్తం చెప్పారట. మోహన్ బాబు దాదాపుగా ఓకే అన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, శింభు, ఐశ్వర్యా రాయ్ లను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ ప్రాజెక్టుకి భారీ క్రేజ్ వచ్చినట్టే. 500 పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబుని మణిరత్నం ఎలా చూపించనున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఏడాది చివర్లో మొదలవనున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version