టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇకపోతే మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు అని చెప్పవచ్చు.
కాగా, నటి కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతున్నట్లు మళ్లీ ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా తన భర్త వికాస్ కు ఆమె దూరంగా ఉన్నానని తెలుస్తుండగా… అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆమె తొలగించడమే దీనికి ప్రధాన కారణం అని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కాగా, గతంలోనూ ఇలా ఫోటోలు తీసేస్తే ఇదే ప్రచారం జరిగితే… దానిని స్వాతి ఖండించారు. 2018లో వికాస్ వాసును ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు.