వలిమైలో కమెడియ‌న్ యోగి బాబు సీన్స్ క‌ట్.. ఫ్యాన్స్ ఆగ్ర‌హం

-

త‌మిళ స్టార్ హీరో అజిత్ వ‌లిమై ఈ నెల 24న త‌మిళం, తెలుగు తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అయింది. త‌మిళంలో అజిత్ క్రేజ్ తో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వ‌లిమై సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న ఉంది. అలాగే భీమ్లా నాయ‌క్ ప్ర‌భావం కూడా ఉంది. కాగ ఈ సినిమా పై త‌మిళ స్టార్ క‌మెడియ‌న్ యోగి బాబు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే..? ఈ సినిమా క‌మెడియ‌న్ యోగి బాబు ఒక కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించాడాట‌.

అయితే ఈ సినిమా ఎడిటింగ్ లో యోగి బాబుకు సంబంధించి ఒక్క స‌న్నివేశం కూడా లేకండా తీసివేశారు. దీంతో యోగి బాబు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా సినిమాల‌ను యోగి బాబు త‌న కామెడీతో హిట్ కొట్టించాడ‌ని అంటున్నారు. అలాంటి గొప్ప క‌మెడియ‌న్ ను అవ‌మానించార‌ని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

అలాగే ఈ సినిమాలో త‌న స‌న్నివేశాల‌ను తొల‌గించింనందుకు యోగి బాబు కూడా చిత్ర యూనిట్ పై గుర్రుగా ఉన్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విషయంపై హీరో అజిత్ తోపాటు డైరెక్ట‌ర్, నిర్మాతల‌తో కూడా చ‌ర్చించ‌డాని తెలుస్తోంది. త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై యోగి బాబు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news