యూపీలో కొనసాగుతున్న ఐదో దశ ఎన్నికల పోలింగ్

-

ఉత్తర్ ప్రదేశ్ లో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇది 5 విడత పోలింగ్. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి భవితవ్యం ఓటర్ల చేతిలో ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. దాదాపు గా 2.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అమెథీ, రాయ్ బరేలీ, అయోధ్యలోొ ఈరోజే ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు చిత్రకూట్, సుల్తాన్ పూర్, ప్రతాప్ గఢ్, కౌశాంబి, ప్రయాగ్ రాజ్, బారబంకి, బహ్రయిచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే నెల 10న ఉత్తర్ ప్రదేశ్ తో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news