చిట్టికి వ‌రుస ఆఫ‌ర్లు.. ఆ సినిమాతో స్టార్ అయిపోతుందా..!

-

జాతిర‌త్నాలు సినిమా ఇటీవ‌ల వ‌చ్చి ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. చిన్న సినిమాగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. క‌రోనా టైమ్‌లోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. ఇక ఇందులో హీరోయిన్‌గా చేసిన ఫారియా అబ్దుల్లా చిట్టిగా అంద‌రికీ న‌చ్చేసింది. యూత్ గుండెల్లో చిట్టిగా పేరును రిజిస్ట‌ర్ చేసేసుకుంది ఈ అమ్మ‌డు.

 

ఈ సినిమా హిట్ తో అంద‌రి ఫోక‌స్ ఫారియాపై ప‌డింది. ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇదే క్ర‌మంలో చిట్టికి మ‌రో క్రేజీ ఆఫర్ వ‌చ్చేసింది. మంచు వారి అబ్బాయి మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీని శ్రీను వైట్ల డైరెక్షన్ చేయ‌డంతో భారీగానే తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీన్ని ఢీ సినిమాకు సీక్వెల్ గా ఢీ2గా తీస్తున్నారు.

ఈ మూవీ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌టంతో.. జాతిరత్నాలు మూవీలో చిట్టీ కామెడీ టైమింగ్ చూసిన శ్రీనువైట్ల ఆమెను ఢీ2లో తీసుకోవాలని ఫైన‌ల్ చేశాడ‌ని తెలుస్తోంది. కామెడీ తో పాటే చిట్టి హైట్ కూడా విష్ణుకు సూట్ కావ‌డంతో ఫారియానే కరెక్ట్ అని మేక‌ర్స్ సెల‌క్ట్ చేశారంట‌. ప్ర‌స్తుతం ఈ మ్యాట‌ర్ ఇండస్ట్రీలో వైర‌ల్ టాపిక్ గా మారింది. మ‌రి ఈ సినిమా గ‌న‌క హిట్ కొడితే చిట్టి స్టార్ హీరోయిన్‌గా మారిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news