బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నాకు క‌రోనా..

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రినీ వ‌దల‌ట్లేదు. రాజ‌కీయ ప్ర‌ముఖుల ద‌గ్గ‌రి నుంచి సినీ సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ త‌న గుప్పిట్లో బంధిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో బాలీవుడ్ బ్యూటీ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డింది. ఆమె ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఉందా అయితే ముందుకు ప‌దండి.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న కంగ‌నార‌నౌత్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా వేదిక‌గా తెలిపారు. త‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, ఇప్పుడు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలిపింది.

తాను గ‌త కొద్ది రోజులుగా వీక్‌గా ఉన్నాన‌ని, క‌ళ్లు కూడా మండుతుండ‌టంతో టెస్టు చేయించుకున్నాన‌ని వివ‌రించింది. కాగా క‌రోనా వైర‌స్ త‌న బాడీలో పార్టీ చేసుకుంటోంద‌న్న విష‌యం ఈ రోజే త‌న‌కు తెలిసింద‌ని తెలిపింది. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది.