ఎన్టీఆర్, కొర‌టాల మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. బ‌ర్త్ డే కానుక‌‌!

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతి త‌క్కువ టైమ్ లోనే మ‌రే హీరోకు సాధ్యం కాని మాస్ బేస్ ను సంపాదించుకుని టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. నంద‌మూరి హీరోకు ఎవ‌రికీ సాధ్యం కాని స్టార్ డ‌మ్ ను ఎన్టీఆర్ సంపాదించుకున్నాడు. నందమూరి హీరోలంటే అంద‌రికీ ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ మాత్ర‌మే అంటే అతిశ‌యోక్తి లేదు. అలాంటి హీరో నుంచి సినీ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. కొర‌టాల శివ‌తో త‌న 30వ సినిమా చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఎన్టీఆర్ దాని నుంచి త‌న పుట్టిన రోజు నాడు అప్ డేట్ ఇస్తాడా అని అభిమానులు చూస్తున్నారు.


ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్ జ‌రుగుత‌న్న స‌మయంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వ‌చ్చింది. ఆ త‌ర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేస్తాడ‌ని తెలియ‌డంతో ఆ సినిమా కాస్తా వాయిదా పడింది. కాగా ఇప్పుడు ఇద్ద‌రి సినిమాలు చివ‌రి ద‌శ‌కు రావ‌డంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. క‌థ సిద్ధంగా ఉండటంతో కొరటాల శ‌రవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తార‌ని స‌మాచారం.

ఇక ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేష‌న్ లో వ‌చ్చే మూవీ షూటింగ్ జూన్ నెల‌లో ప్రారంభం అవుతుంది. ఆచార్య సినిమా షూటింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తున్న శివ.. గతంలోనే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన‌ స్క్రిప్ట్ రైటింగ్ పనులను పూర్తి చేశాడ‌ని స‌మాచారం. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్ఆర్ఆర్ నుంచి కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ కానున్న‌ట్టు వార్త వినిపిస్తోంది. ఇది జ‌రిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండ‌గే.

Read more RELATED
Recommended to you

Latest news