Pooja Hegde: టాలీవుడ్ హీరోయిన్‌పై క్రికెటర్ మనసు..పూజా హెగ్డే ఫొటోలకు లైక్స్..అతనెవరంటే?

-

టాలీవుడ్ హీరోయిన్ లపై క్రికెటర్లు మనసు పారేసుకుంటున్నంటున్నారు. ఇటీవల కాలంలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఫొటోలను యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ లైక్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. వూ ఆర్ యూ? అని హీరోయిన్ ప్రశ్నించగా, నెటిజన్లు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య ఏముందని చర్చ నెట్టింట జోరుగా జరిగింది.

తాజాగా మరో క్రికెటర్ మరో టాలీవుడ్ హీరోయిన్ పై మనసు పడ్డట్లు స్పష్టమవుతోంది. ఆ హీరోయిన్ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసే ఫొటోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బీస్ట్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ భామ హాట్ ఫొటోలు షేర్ చేసింది. కాగా, ఆ ఫొటోలను క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.

గత కొన్ని మ్యాచ్ ల నుంచి రుతురాజ్ ఆట తీరు అధ్వానంగా ఉందని, అందుకు కారణం ఫోకస్ తప్పడమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ మీద ఫోకస్ తగ్గించి ఆట మీద కాన్సంట్రేట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రుతురాజ్ ను ట్రోల్ చేస్తున్నారు.

రుతురాజ్ నిజంగానే పూజా హెగ్డేను లైక్ చేస్తున్నాడా? వీరు అంతకు ముందు ఎప్పుడైనా కలిశారా? భవిష్యత్తులో వీరి ప్రేమాయణం వెలుగులోకి వస్తుందా? అనే చర్చ జరుగుతున్నది. పూజా హెగ్డే నటించిన ‘ఆచార్య’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news