ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్..త్వరలోనే ‘కేజీఎఫ్ ఛాప్టర్ 3’ కూడా..!

-

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎప్ చాప్టర్ 1’ క్రియేట్ చేసిన హిస్టరీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాప్టర్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాప్టర్ 2 సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్‌ షో చూసిన ప్రతి ఒక్కరూ.. బంపర్‌ హిట్‌ అని చెబుతున్నారు.

బీస్ట్‌ అంచనాలను అందుకోకపోవడంతో.. కేజీఎఫ్‌ కే వెళుతున్నారు ప్రేక్షకులు. అయితే.. ప్రీమియర్‌ షో ద్వారా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3 కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

పవర్‌ ఫుల్‌ పొలిటీషీయన్‌ రోల్‌ పోషిస్తున్న రవీనా టండన్‌ కేజీఎఫ్‌ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో.. కవర్‌ పేజీని తిప్పే..నేపథ్యంలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3అనికనిపించడాన్ని ఆ వీడియోలో మనం చూడవచ్చు. దీంతో కేజీఎఫ్‌ చాప్టర్ 3 వస్తుందనేది అర్థమవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ సినిమా ప్రమోషన్లలోనూ.. కేజీఎఫ్‌ 3 చాప్టర్‌ వస్తుందనే దానిపై ప్రశాంత్ నీల్‌ కూడా సానుకూలంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news