థీయేట‌ర్లు మూతప‌డుతుంటే ఏడుపు వ‌స్తుంది : ఆర్ నారాయ‌ణ మూర్తి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ధ్య సినిమా టికెట్ల విష‌యంలో ర‌గ‌డ పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే హీరోలు నాని, సిద్ధార్థ్, నిఖిల్ తో పాటు ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు సినిమా టికెట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తాజా గా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ లో సినిమా టికెట్ల విష‌యం పై స్పందించారు. ఈ రోజు హైద‌రాబాద్ లో హీరో నాని శ్యామ్ సింగ రాయ్ స‌క్సస్ మీట్ లో ఆయ‌న పాల్గొన్నారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ లో థీయేట‌ర్లు మూత ప‌డుతుంటే త‌న‌కు ఏడుపు వ‌స్తుందని అన్నారు. సినిమాలు తీసేవాడు, చూపేవాడు, చూసే వాడు ఉంటేనే సినిమా ప‌రిశ్ర‌మకు మంచి రోజులు, మ‌నుగ‌డ ఉంటాయ‌ని అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో థీయేట‌ర్ల‌ను మూసివేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యం పై తెలుగు సినిమాల‌ నిర్మాతల మండలి, మూవీ ఆర్టీస్ట్ అసోసియేష‌న్ త‌క్ష‌ణమే జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే తెలుగు సినీ పరిశ్ర‌మ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం అని అన్నారు. పండుగ స‌మ‌యాల్లో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి గ‌డ్డు ప‌రిస్థితి తీసుకురావ‌ద్ధ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news