మాట‌ల్లేవ్‌.. అంద‌రూ అదుర్సే.. పుష్ప రికార్డుల కోత‌రా..

-

దాక్కో దాక్కో మేక అంటూ వ‌చ్చిన పుష్ప ప‌స్ట్ సింగిల్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఒక్క‌సారి వింటే వ‌దిలేలా లేదు. పాట‌లో హైలైట్ ఏంటో చెప్ప‌డం క‌ష్టం.. ఎందుకంటే పాటే ఓ హైలైట్.. చంద్ర‌బోస్ వాడిన ప‌దాల‌కు దేవి శ్రీ ప్ర‌సాద్ ఓ రేంజ్ బీట్ తో అద‌ర‌గొట్టాడు. సింగ‌ర్ శివం ప‌త‌క్‌ వాయి కూడా ఈ పాట‌కు మంచి ప్ల‌స్ అయ్యింది. ఇక స్టైలీష్ స్టార్ యాటిట్యూడ్‌తో కూడిన మూవ్‌మెంట్స్ అబ్బః పాట‌కు త‌గ్గట్టుగా, ఓ రేంజ్ లో ఉన్నాయ్ మ‌రి.

అన్నం ఉడికిందీ లేనిది చెప్ప‌డానికి ఒక్క మెతుకు చాలు అంటారు అలానే ఈ సినిమా రికార్డుల‌ను కొట్టేస్తుంద‌ని చెప్ప‌డానికి ఈ పాట మ‌రో కార‌ణం. అన్నీ కుదిరాయి అనిపించేలా రికార్డుల‌ను ఊచ కోత కోస్తుంద‌నిపిస్తుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌, దేవి శ్రీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల పాట‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. అంత‌కు వంద‌రెట్ల సంతోషం పొందొచ్చు అల్లువారి ఫ్యాన్స్‌. బీట్‌తో అద‌ర‌గొట్టిన దేవిని ఎంత మెచ్చుకున్నా త‌క్కువే. విజువ‌లైజేష‌న్ కూడా కొత్త‌గా (తెలుగుకు) ప‌రిచయం చేశారు.

ఫస్ట్ లుక్ విడుదలైనప్ప‌టి నుండి అల్లు అర్జున్ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్ హిట్ ప‌క్కా అంటున్నారు. ఇక ఈ పాట‌తో అల్లు ఫ్యాన్స్‌కి ప‌ట్ట‌ప‌గ్గాలేనట్లే. మామూలుగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు పుష్ప పాట‌ను ట్రెండింగ్‌లో ఉంచే ప‌నిలో ప‌డ్డారు. సుకుమార్ మరోసారి తమ హీరోకు బ్లాక్ బస్టర్ ఇస్తారని గ‌ట్టిగా నమ్ముతున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా రంగ‌స్థ‌లం లాగానే రివేంజ్ స్టోరీ అంటూ సోష‌ల్ మీడియాలో అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ ఇండస్ట్రీకి మాత్రం మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌తో పాటు తెలుగు సినిమా స‌త్తా చాటే చిత్రం రానుంద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news