PUSHPA : “దాక్కో దాక్కో మేక” వచ్చేసింది !

-

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ పుష్ప నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది. “దాక్కో దాక్కో మేక” అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. ఇక ఇప్పటికే ఈ సాంగ్‌ పై సూపర్‌ బజ్‌ ఏర్పడింది. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ లో వచ్చిన ఈ పాటకు శివమ్‌ వోకల్స్‌, చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించారు. 5 భాషల్లో ఐదుగురు సింగర్స్‌ ఈ పాటను పాడారు. ఈ మాస్‌ బీట్‌ రికార్డులు బ్రేక్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news