రివ్యూ: దబాంగ్ 3 బ్లాక్ బస్టర్ బొమ్మ ..!

-

ఇంట్రడక్షన్: సల్మాన్ ఖాన్ ఇండియాలోనే తిరుగులేని సూపర్ స్టార్. కొంతకాలం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజవుతుందంటే చాలు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అటువంటిది తాజాగా ఆయన కెరీర్లోనే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు దబంగ్ పేరిట నమోదు చేసుకుని అనేక రికార్డులు పగలగొట్టడం జరిగింది. అటువంటిది తాజాగా ఆయన నటించిన ‘దబంగ్ 3’ డిసెంబర్ 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా విడుదలయ్యింది.

దబాంగ్ 3 స్టోరీ విశ్లేషణ:  స్టోరీ పరంగా చూసుకుంటే డైరెక్టర్ ప్రభుదేవా ఎక్కువ మాస్ పల్స్  ఆకట్టుకునే విధంగా సినిమాని తెరకెక్కించాడు. గత చిత్రాల్లో దబాంగ్ లో నటించిన విధంగా సల్మాన్ ఖాన్ చేత అవే చిలిపి చేష్టలు ఈ సినిమాలో చేయించాడు. సల్మాన్ ఖాన్ తో విలన్ గా చేసిన కిచ్చా సుదీప్ అదరగొట్టే నటన చేశాడు. ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ తో ప్రభుదేవా నడిపించాడు.  ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించినప్పటికీ ఎమోషనల్ గా కట్టుకుంటుంది. అసలు గేమ్ ఇంటర్వెల్ నుంచి మొదలవుతుందట. ప్రభుదేవా దర్శత్వంతో, సల్మాన్ నటనతో సెకండ్ హాఫ్ అదరగొట్టిపడేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సయీ మంజ్రేకర్ మధ్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల్లో కండల వీరుడు పాతికేళ్ల కుర్రాడిగా నటించాడు.

సినిమా పాజిటివ్:  సినిమా పాజిటివ్ విషయానికొస్తే స్టోరీ అంతా సూపర్. మరియు సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా అదరగొట్టే రీతిలో ఉంటుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన నటన మరియు డైలాగులు(హిందీలో అయితే) థియేటర్లో సల్మాన్ అభిమానులను ఈలలు వేసేలా చేస్తాయి. కొన్ని కామెడీ ట్రాకులు కూడా అదరగొట్టే రీతిలో డైరెక్టర్ ప్రభుదేవా తీశాడు.

సినిమా నెగిటివ్: డబ్బింగ్ అదేవిధంగా తెలుగు లో సినిమా డైలాగులు… సరిగ్గా కుదరలేదు. తెలుగు నేటివిటీ సినిమా ప్రేమికులకు కచ్చితంగా సినిమా నచ్చదు. సినిమా చూస్తున్నంత సేపు చాలా స్లో గా వెళ్తున్నట్లు…బోరింగ్ గా ఉంటుంది.

ఓవరాల్ గా: బాలీవుడ్ సూపర్ స్టార్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 డిసెంబర్ 20వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యింది. తెలుగులో సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో సల్మాన్ ఖాన్ తో తెలుగు హీరోలు విక్టరీ వెంకటేష్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొని సినిమాకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రభుదేవా దర్శకత్వంలో సినిమా రావడంతో సినిమాపై అంచనాలు సల్మాన్ ఖాన్ అభిమానులు భారీగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా హిందీలో మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చినట్లు ఇప్పటికే టాక్ బయటకు వచ్చేసింది. అయితే తెలుగులో విడుదలైన ఈ సినిమాకి సినిమాలో ఉన్న డైలాగులు మరియు సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా ఏమీ లేదు.

సల్మాన్ ఖాన్ నటించిన మొదటి దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత 2012లో వచ్చిన దబంగ్ 2 కూడా మంచి విజయం సాధించింది. అయితే తాజాగా విడుదలైన దబంగ్ 3 మాత్రం తెలుగు నేటివిటికి నచ్చే విధంగా సినిమాలో పెద్దగా మ్యాటర్ లేనట్టు తేలిపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు నార్త్ లో సినిమాకి మంచి టాక్ వచ్చినా గానీ తెలుగులో మాత్రం రాణించడం కష్టమే. పైగా ఇదే సమయంలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో దబంగ్ 3 తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎక్కే ప్రసక్తే లేదు సినిమాలో అన్ని సోది డైలాగులు వెళ్లిన డబ్బింగ్ అంతంత మాత్రంగా ఉంది. సో మొత్తం మీద దబాంగ్ 3 తెలుగు లో పెద్దగా రాణించలేదు. ఇప్పటి నుండి సంక్రాంతి  వరకు వరుసగా టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వుతున్నా తరుణం లో సినిమా హాల్స్ దగ్గర కూడా ఫుల్లుగా తాకిడి రాబోయే రోజులో ఉండబోతున్న నేపధ్యం లో కొన్ని రోజులోనే సినిమా హాల్స్ లో కూడా కనిపించదు అనేది మాత్రం గారెంట్రీ. మొత్తం మీద సల్లు బాయ్ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కొట్టిన టాలీవుడ్లో మాత్రం మెప్పించలేకపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news