Dasara : దసరా నుంచి ‘ఓరి వారి’ సాంగ్…దుమ్ములేపిన నాని

-

నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ మూవీ ఆ మధ్య విడుదలై ఓకే అనిపించుకున్న సంగతి తెలిసిందే. కంటెంట్ బాగున్న ఎందుకో పెద్దగా కనెక్ట్ కాలేదు జనాలకు. దీంతో కలెక్షన్స్ అనుకున్న రేంజ్‌లో రాలేదు. అయితే.. ఆ తరువాత అలా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చేసిన నాని, ఆ తరువాత సినిమాగా ‘దసరా’ చేశాడు.

ఎస్.ఎల్.వి. సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నాని పక్కా మాస్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన రెండో సినిమా ఇది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఓరి వారి నీదు గాదుర పోరి.. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి’ అంటూ సాగే పాటను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ పాటలో నాని దుమ్ములేపాశాడు.  సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మార్చి 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news