ప్రిన్స్ పుట్టినరోజుకు డేవిడ్ వార్నర్ ఆశ్చర్యపరిచే విషెస్. !

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటులు శుభాకాంక్షలు తెలిపారు. వాటిలో ప్రముఖ క్రికెటర్ తెలిపిన శుభాకాంక్షలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో టిక్ టిక్ చేస్తూ అభిమానులను అలరించారు. అందులో భాగంగా మహేష్ బాబు చిత్రంలో మైండ్ బ్లాక్ అనే పాటకు గవర్నర్ తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి చిత్రీకరించిన వీడియో ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే లెజెండ్ అంటూ విషెస్ తెలిపారు.

సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ వచ్చేసింది. సూపర్​స్టార్ మహేశ్​బాబు పుట్టినరోజు సందర్భంగా దీనిని విడుదల చేశారు. ఇందులో మాస్​గా కనిపించనున్నారు మహేశ్. మణికట్టుకు ‘ఓం’ లాకెట్, రూపాయి బిళ్లను పైకి ఎగురేస్తున్న అతడి​ చేతిని మాత్రమే ఇందులో చూపించారు.
ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించనుంది. తమన్ సంగీత దర్శకుడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్​టైన్​మెంట్స్, జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం వచ్చే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news