రౌడీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా.. డియర్ కామ్రేడ్ టీజర్ టైం ఫిక్స్!

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టీజర్ మార్చి 17 అనగా రేపు ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. టీజర్ కూడా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి సందడి చేయనుంది. తెలుగులో విజయ్ తో పాటుగా రష్మిక క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.. కన్నడలో కూడా అమ్మడికి వీరాభిమానులు ఉన్నారు. కాబట్టి డియర్ కామ్రేడ్ కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ టీజర్ చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని హీరోయిన్ రష్మిక తన ట్వీటర్ లో చెప్పింది. మరి నిమిషం టీజర్ లో అంతగా ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.