నారాయణ సేవ చేస్తే ఈరాశివారికి అన్ని కలిసి వస్తాయి! మార్చి 17 రాశి ఫలాలు

మార్చి 17 ఆదివారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి- మిశ్రమం. విరోధాలు, వస్యనాల వల్ల నష్టం. కార్యనష్టం.
పరిహారాలు- నారాయణసేవ చేయండి అనుకున్న పనులు పూర్తి అవుతాయి.

వృషభరాశి- ప్రతికూల ఫలితాలు, అపజయం, వ్యవహారనష్టం, పనులు పూర్తికావు.
పరిహారాలు- నారాయణసేవ చేయండి తప్పక మంచి జరుగుతుంది.

మిథునరాశి- ప్రతికూల ఫలితాలు, ధనవ్యయం, విరోధాలు, వాహనాల వల్ల ప్రమాద సూచన.
పరిహారాలు- సూర్యనమస్కారం, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి- అనుకూల ఫలితాలు, ధనలాభం, విందులు, కాలక్షేపం.
పరిహారాలు- నారాయణసేవ చేయండి. మంచి జరుగుతుంది.

సింహరాశి- ప్రతికూలమైన ఫలితాలు. కార్యనష్టం, ధనవ్యయం, బంధువులకు సంబంధించి చెడువార్తా శ్రవణం.
పరిహారాలు- పేదవారికి అన్నదానం, గోవులకు క్యారెట్, కీరదోసకాయ తినిపించడం చేయండి దోషాల తీవ్రత తగ్గుతుంది.

కన్యారాశి- అనకూలం. ఆకస్మిక ధనలాభం, విందులు, వస్తులాభం.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దేవీ పూజ మంచిది.

తులారాశి- అనకూలం. వ్యవహారాలు కలిసి వస్తాయి, కార్యజయం, ధనలాభం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి మంచిది.

వృశ్చికరాశి- అనుకూల ఫలితాలు, కుటుంబ సఖ్యత, ఉత్సాహం, జయం, ఇంట్లో సంతోషం.
పరిహారాలు- పేదలకు అన్నదానం (నారాయణసేవ) మంచిచేస్తుంది.

ధనస్సురాశి- ప్రతికూల ఫలితాలు, అనారోగ్యం, ఖర్చులు, నష్టం, అలసట, శ్రమ.
పరిహారాలు- నారాయణసేవ చేయండి మీ దోషాలు పోతాయి.

మకరరాశి- అనుకూలం. చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు, విందులు, ఉత్సాహం.
పరిహారాలు- రావిచెట్టుకు ప్రదక్షణలు, నమస్కారం, ఏదైనా తియ్యనిపదార్థం నైవేద్యంగా సమర్పించండి.

కుంభరాశి- అనుకూలం. ప్రయాణ సూచన, మనఃశాంతి, పనులు పూర్తి.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, సూర్యనమస్కారాలు, అర్ఘ్యం వదలడం చేయండి.

మీనరాశి- మిశ్రమం. కార్యజయం,వస్తునష్టం, అధిక ఆదాయం, విబేధాలు.
పరిహారాలు- నారాయణసేవ, గోసేవ, దానధర్మాలు మీ చెడు ఫలితాల తీవ్రతను తగ్గిస్తాయి. మేలు చేస్తాయి.

నోట్ – నారాయణ సేవ అంటే పేదలకు కడుపునిండా ప్రేమతో భోజనం పెట్టడం. మీకు వీలైనంత మేరకు ప్రయత్నించండి. లోభత్వం చేయకూడదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చాలా దోషాలకు ఇది అమోఘంగా పనిచేస్తుంది. స్వల్ప ఖర్చుతో మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఐదురూపాయలకు భోజనం పెట్టే కేంద్రాల వద్ద కనీసం 2 లేదా ముగ్గురికి అన్నం పెట్టించండి. మీకు మంచి జరుగుతుంది.

– కేశవ