చావు – బ్రతుకుల మధ్య పోరాడుతున్న ప్రముఖ నటిని కాపాడిన బాలకృష్ణ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో బాలకృష్ణ బయటకు గంభీరంగా కనిపించినా.. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు అని.. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈయన తన సినిమా షూటింగ్ లో క్రమశిక్షణ గా ఉండాలి అని అంటారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు.. అందుకే చాలామంది నటీనటులు బాలయ్యతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ కేవలం అందరితో సరదాగా గడపడమే కాకుండా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా తాను ఉన్నాను అంటూ వారికి అండగా నిలుస్తారు. ఇక ఈ క్రమంలోనే ఒక నటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా బాలకృష్ణ ఆమెను కాపాడారు అని చెప్పవచ్చు.Allari Subhashini : సీఎం కేసీఆర్ నా ప్రాణ దాత ఆయన లేకపోతే.. కన్నీరు పెట్టుకున్న నటి అల్లరి సుభాషిణి. | Allari subhashini emotional words about telangana cm kcr | TV9 Telugu

ఆమె ఎవరో కాదు అల్లరి సినిమాలో అల్లరి నరేష్ కి తల్లి పాత్రలో నటించిన ప్రముఖ నటి సుభాషిణి. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె.. చెన్నకేశవరెడ్డి, బెండ్ అప్పారావు ఆర్ఎంపి, ఈశ్వర్ తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేస్తుంది . కమెడియన్ గా, ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన సుభాషిణి ఒక సందర్భంలో క్యాన్సర్ బారిన పడింది. ఇక ఈ విషయం తనకు తెలిసిన వారికి చెప్పగా.. బాలకృష్ణతో ఈ విషయాన్ని చెప్పమని ఆమెకు సలహా ఇచ్చారట. అప్పటికే అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న సుభాషిణి కి క్యాన్సర్ సోకడంతో ఆమె మరింత కృంగిపోయింది.Subhashini & Vijay Comedy Scene || Ammailu Abbailu Movie - YouTubeఇక చివరికి బాలకృష్ణ ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన తన తల్లి పేరు మీద నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ఆమెకు ఉచితంగా వైద్యం ఇప్పించారట. ఇక 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగా ఆమెకు చికిత్స చేయించి ఆమె ప్రాణాలను నిలబెట్టారు బాలకృష్ణ.Balakrishna rings in 60th birthday with cancer survivors. See pics - Movies News

ఇక ఆ తర్వాత యాంకర్ సుమ కనకాల సహాయంతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అమెరికన్ సంస్థ ద్వారా మందులను పంపిణీ చేయిస్తోంది. మొత్తానికి అయితే తాను ఇలా బ్రతికి బయటపడడానికి కారణం బాలకృష్ణ గారే అని ఎప్పుడు చెబుతూ ఉంటుంది సుభాషిని.