డీప్ ఫేక్ బారిన పడిన దీపిక పడుకొనే,తన ముద్దుల కూతురు!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే, రణవీర్ దంపతులు పండంటి కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.సెప్టెంబర్ -8న వారికి ఆడపిల్ల పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో వారు ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘వారు ఉమ్మడిగా పెట్టిన పోస్టులో ‘ఆడబిడ్డకు స్వాగతం. 8-9-2024. దీపికా & రణవీర్’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లోనే తెగ వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు మరియు స్నేహితులు దీపిక, రణవీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దంపతులకు విషెస్ తెలిపిన వారిలో అలియా భట్, ఆమె సోదరి షాహీన్ భట్, రుబీనా దిలైక్, అమృతా ఖాన్విల్కర్, అథియా శెట్టి మరియు మలైకా అరోరా వంటి ప్రముఖలు ఉన్నారు.

అయితే, బేబీ ఫోటోలను దీపిక దంపతులు ఎక్కడా రివీల్ చేయలేదు. ఈ రోజుల్లో తమ పిల్లలకు సంబంధించిన ప్రైవేసీని సెలబ్రిటీలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈక్రమంలోనే నెట్టింట దీపిక ఆస్పత్రి బెడ్ మీద పడుకొని తన గుండెమీద బేబీని పట్టుకుని పడుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో బేబీ ఫేస్ మొత్తం రివీల్ చేసినట్లు ఉంది. అయితే, అవి నిజమైన ఫోటోలు కావని, డీప్ ఫేక్ ఫోటోలు అని నిరూపితమైంది. కొందరు పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఏఐ సాయంతో ఇలాంటి డీప్ ఫేక్ చేస్తున్నారని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news