దీపికాను చిన్నప్పుడే అలా వాడేశారట..!

-

బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకునేకి మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందించారు. రీసెంట్ గా జరిగిన ఈ అవార్డ్ వేడుకల్లో దీపికా పదుకునేని పొలిటికల్ టర్న్ తీసుకునే ఆలోచన ఉందా.. అని అడిగారట. దానికి సమాధానంగా దీపిక ప్రస్తుతానికి లేదు ఒకవేళ వస్తే కనుక తను సచ్చ భారత్ మంత్రిని అవుతా అంటుంది. తాను చిన్నప్పుడు తను బంధువుల ఇంటికి వెళ్తే తనని అక్కడే వారు ఉంచుకునే వారని చెప్పిన దీపిక తనకి చిన్నప్పుడే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సంబరపడ్డానని.. కాని తాను ఎక్కడ ఉంటే అక్కడ పరిశుభ్రంగా ఉండేలా చేస్తానని చెప్పి తనని బంధువులు తీసుకెళ్తారని చెప్పింది.

అలా చిన్నప్పుడు అందరు వాడేశారని అమాయకంగా చెప్పింది దీపికా పదుకునే. రణ్ వీర్ తో ప్రేమ పెళ్లి తర్వాత ఈమధ్య మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న దీపికా సినిమాల వేగం కూడా తగ్గించింది. రణ్ వీర్ సింగ్ మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పెళ్లి తర్వాత వచ్చిన సింబా, గల్లీ బోయ్ రెండు సినిమాలు రణ్ వీర్ సింగ్ కు సూపర్ హిట్ అందించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version