కోడి రామకృష్ణ తన తలకు గుడ్డ ఎందుకు కట్టుకునేవారో తెలుసా?

-

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. దానిపై చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కోడి రామకృష్ణ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కోడి రామకృష్ణతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయనతో ఉన్న స్మృతులను నెమరు వేసుకున్నారు. టాలీవుడ్ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు వాపోయారు. కోడి రామకృష్ణ దాదాపు 120 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

అయితే.. కోడి రామకృష్ణ.. అందరి దర్శకుల్లా కాదు. కాస్త డిఫరెంట్ గా ఉండే డైరెక్టర్. ఆయన సినిమాలు ఎంత వినూత్నంగా, డిఫరెంట్ గా ఉంటాయో… ఆయన వేషధారణ కూడా అలాగే ఉంటుంది. ఆయన వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దానికీ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఆయన తన తలకు కట్టుకునే గుడ్డ గురించి చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు, ఎక్కడ బయట కనిపించినా ఆయన తలకు ఓ గుడ్డను కట్టుకుంటారు. అది లేకుండా ఆయన్ను మనం ఇప్పటి వరకు చూసింది లేదు.

తను తలకు గుడ్డను ఎందుకు కట్టుకుంటారో రామకృష్ణే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాపల్లెలో గోపాలుడు అనే సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిందే. ఆ సినిమాతోనే అర్జున్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ సినిమాకు పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ మోకా రామారావు… ఎండలో కోడి రామకృష్ణ తల మాడిపోతుందని తన జేబులో నుంచి రుమాలు తీసి ఆయన తలకు కట్టారు. తెల్లారి.. మోకా రామారావు.. కొత్త బ్యాండ్ ను తయారు చేయించి తీసుకొచ్చి కోడి రామకృష్ణ కు ఇచ్చారట. దీంతో దాన్ని సెంటిమెంట్ గా అప్పటి నుంచి అలాగే కట్టుకున్నారట కోడి రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version