బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకొస్తున్న దీప్తి..?

-

బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ వీక్ నడుస్తుంది. ఇంకా నాలురు రోజులు మాత్రమే ఉన్న ఈ షో ఇప్పుడు మంచి రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న ఐదుగురు కౌశల్, గీతా మాధురి, తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్ లలో కౌశల్, దీప్తి, గీతా మాధురి ఫైనల్ 3లో ఉంటారని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఈరోజు ఎపిసోడ్ నుండి దీప్తి నల్లమోతు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఓటింగ్స్ లో కౌశల్ ఆర్మీకి పోటీగా దీప్తి ఫాలోవర్స్ ఫేక్ ఓట్లు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటి కారణం చేత బిగ్ బాస్ ఈరోజు దీప్తిని ఎలిమినేట్ చేసి హౌజ్ నుండి బయటకు పంపిస్తున్నాడని అంటున్నారు. బిగ్ బాస్ నుండి వచ్చిన లీకుల ప్రకారం ప్రతి ఒక్కటి లీకైనట్టుగానే జరిగింది. మరి ఈరోజు దీప్తి నిజంగానే బయటకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి. ఇక కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో కౌశల్ టైటిల్ విన్నర్ రేసులో ముందంజలో ఉన్నాడు. చూస్తుంటే దాదాపు కౌశల్ కే టైటిల్ వచ్చేలా పరిస్థితి కబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news