స్వీటీకి ఎంత కష్టం వచ్చింది

-

స్వీటీ అనుష్కకు కష్టాలేంటి.. ఎంచక్కా కమర్షియల్ సినిమాలతో పాటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ సత్తా చాటుతుంది అనుకోవచ్చు. ఫీమేల్ లీడ్ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ అమ్మడు సైజ్ జీరో కోసం బరువు పెరిగిన విషయం తెలిసిందే. అయితే పెరగడం అయితే పెరిగింది కాని తగ్గడం మాత్రం ఆమె వల్ల కావట్లేదు. ఈమధ్య కాస్త తగ్గినట్టు అనిపంచిపించినా మళ్లీ లావెక్కిందని తెలుస్తుంది.

అందుకే ఇప్పుడు అనుష్క డీటాక్స్ ప్రొగ్రాంకు రెడీ అయ్యిందని తెలుస్తుంది. వరల్డ్ ఫేమస్ డీటాక్స్ సెంటర్ ఆస్ట్రియాలోని వివా మేయర్ లో అనుష్క డీటాక్స్ చేయించుకోనుందట. అక్కడ వారి అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తుంది. స్లిమ్ లుక్ కోసం అనుష్క పడరాని పాట్లు పడుతుంది.

ఎస్-3, బాహుబలి-2 తర్వాత ప్రస్తుతం కోనా వెంకట్ డైరక్షన్ లో మాధవన్ హీరోయిన్ గా ఓ సినిమా చేస్తుంది అనుష్క. ఆ సినిమా చేస్తూనే మరో పక్క సన్నబడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందట. మరి ఒకప్పటి అనుష్కలా సన్నగా మారేందుకు అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నమైనా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news