చంద్రుడిపై సాయిబాబా ముఖం.. ఇందులో నిజమెంత.. అబద్ధమెంత?

-

ఇది టెక్నాలజీ యుగం బాస్. తమ్మిని బమ్మి బమ్మిని తమ్మి చేయగల టెక్నాలజీ ఇప్పుడు మన సొంతం. అందుకే సోషల్ మీడియాలో ఏవేవో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. చివరకు దేవుళ్లనూ వదిలిపెట్టట్లేదు జనాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని ఫోటోల గురించి. చంద్రుడిలో సాయిబాబా కనిపిస్తున్నాడట. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరలవుతుండే సరికి జనాలు నిజంగా చంద్రుడిలో సాయిబాబా కనిపిస్తున్నాడంటూ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ.

అయితే.. ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి మనం. ఒకటి పారడోలియా. రెండోది ఫోటో షాప్. ఈరెండింటి వల్లే.. చంద్రుడి మీద సాయిబాబా రూపం కనిపించడం.. ఇంకా మేఘాల్లో ఏదో కనిపించడం.. ఆకాశంలో ఏలియన్స్ కనిపించడం లాంటివి జరుగుతుంటాయి.

పారడోలియా అంటే భ్రాంతి. భ్రమ. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ఊహించుకోవడం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను చూసి వాటిలో ఏదో ఉంది అనుకోవడం లాంటిదన్నమాట. అక్కడ ఏం లేకున్నా.. మన మైండ్ లో వాళ్ల బొమ్మ ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి.. ఆ బొమ్మను అక్కడ ప్రతిరూపంగా చూడటానికి మన మైండ్ ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో అక్కడ వాళ్లు ఉన్నట్టు ఊహించుకోవడం ప్రారంభిస్తాం. దీన్నే ఇల్యూజన్ అని కూడా అనొచ్చు.

ఇక.. మరోది ఫోటోషాప్. ఇది మీకు తెలిసిందే. ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి కావాలని వైరల్ చేస్తారు. అవన్నీ ఫేక్ ఫోటోలు. గతంలో కూడా చంద్రుడిపై సత్యసాయిబాబా(పుట్టపర్తి), ఏసుక్రీస్తు కనిపించాడంటూ పుకార్లు సృష్టించారు. కానీ.. ఇదంతా ఫేక్. ఎందుకంటే.. బైనాక్యులర్స్ పెట్టుకొని చూసినా చంద్రుడి మీద ఎవరి ముఖం కనిపించదు. కావాలంటే మీరు బయటికి వెళ్లి ఒకసారి చంద్రుడిని ప్రశాంతంగా తిలకించండి.. అర్థమవుతుంది మీకే.

Read more RELATED
Recommended to you

Latest news