“ధమాకా” రిలీజ్ డేట్ ఫిక్స్..అస్సలు తగ్గదేలేదుగా !

-

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరో రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగి మాస్ మహారాజాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రవితేజ.

ఇక రవితేజ.. తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. అయితే.. దీపావళి నేపథ్యంలో ఈ పోస్టర్ అలాగే రిలీజ్ డేట్ ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను డిసెంబర్‌ 23న రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news